మెగా అల్లుడి మూవీ రెడీ టు రిలీజ్

0

మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాతో నిరాశ పర్చాడు. విజేత అంటూ వచ్చిన చిరంజీవి చిన్న అల్లుడు పరాజయం పాలయ్యాడు. మొదటి సినిమా నిరాశ పర్చడంతో గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ ఎట్టకేలకు రెండవ సినిమా సూపర్ మచ్చిని పూర్తి చేశాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ మచ్చి సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందట. సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని భావించినా కూడా కరోనా వల్ల సినిమా షూటింగ్ ను పూర్తి చేయలేక పోయారు.

లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఈ సినిమాను మూడు వారాల పాటు షూటింగ్ చేసి పూర్తి చేశారు. షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ సభ్యులు విడుదలకు సిద్దం చేశారు. థియేటర్ల ఓపెన్ కు కేంద్రం నుండి అనుమతలు వచ్చినా కూడా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయి థియేటర్లు ఓపెన్ కావడం లేదు. కనుక సినిమా థియేటర్లు ఓపెన్ అయిన సమయంలో సూపర్ మచ్చిని విడుదల చేసే విషయమై ఆలోచిస్తున్నారు. ఓటీటీ ఆఫర్లు వస్తున్నా కూడా తిరష్కరిస్తున్నారట. మొదటి సినిమా నిరాశ పర్చడంతో ఈసినిమాపై మెగా అల్లుడు మరియు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుని ఉన్నారు. పులి వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అయిన మెగా అల్లుడికి సక్సెస్ తెచ్చి పెట్టేనో చూడాలి.