రాజ్ తరుణ్ – వర్ష బొల్లమ్మ కాంబోలో కొత్త సినిమా ప్రారంభం!

0

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ జోష్ లో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాని డైరెక్ట్ చేసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా యువ హీరో మరో కొత్త సినిమాని ప్రారంభించాడు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందనున్న ఈ చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. రాజ్ తరుణ్ కెరీర్లో 15వ చిత్రంగా రానున్న ఈ మూవీలో ‘చూసి చూడంగానే’ ‘జాను’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించనుంది.

కాగా #Raj15 చిత్రానికి సాంటో(మోహన్ వీరంకి) దర్శకత్వం వహించనున్నారు. తెలుగులో ‘టెర్రర్’ చిత్రానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన సాంటో.. ఇంగ్లాండ్ లో పలు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాడు. ఇప్పుడు తెలుగులో డైరెక్టర్ గా డెబ్యూ మూవీతో వస్తున్నాడు. ఈ చిత్రాన్ని నంద కుమార్ అబ్బినేని – భరత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన స్వీకర్ అగస్తి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.