యండమూరి నవలకు అత్యున్నత గౌరవం.. హాలీవుడ్ సినిమాగా..

0

ప్రముఖ తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ‘ఆనందోబ్రహ్మ’. మనుషుల మధ్య సంబంధాలు ఆత్మీయతలు చాటిచెప్పే గొప్ప నవలగా తెలుగులో పేరు పొందింది. ఓ పల్లెటూరి యువకుడు పట్నం వస్తే ఓ గృహణి సేదతీరుస్తుంది. వారి మధ్య బంధం ఏంటి? సంబంధం ఏంటనేది ఆక్టుకునేలా యండమూరి రాశారు.

అయితే ఇప్పటివరకు యండమూరి రాసిన అన్ని నవలలు అమ్ముడుపోయి సినిమాగా వచ్చాయి. కానీ ‘ఆనందో బ్రహ్మ’ మాత్రం ఆ అదృష్టాన్ని దక్కించుకోలేకపోయింది. 2009లో పనిమీద 1729 పిక్చర్స్ అనే హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ అధిపతి అయిన ముక్తేష్ రావు మేక హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో రెండేళ్లకు గాను రైట్స్ తీసుకున్నారు. కానీ నాడు సినిమాగా తీయలేకపోయారు. ఆ తర్వాత ఆయన హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు తీసి గొప్ప నిర్మాతగా మారారు.

ఇటీవలే భారత్ కు వచ్చిన ముక్తేష్ రావు మేక మళ్లీ ‘ఆనందో బ్రహ్మ నవల హక్కులను పొందారు. ఈసారి సినిమా తీస్తానని.. గోదావరి తీరాన జరిగిన ఈ కథను అమెరికాలోని మిసిసిపీ నదీ తీరంలో తీస్తానని ఆయన తెలిపారు. 35 ఏళ్ల కల సాకారం అయ్యిందని.. ఇదొక యూనివర్సల్ స్టోరీ అని అన్నారు.

ఆనందో బ్రహ్మ నవలను సినిమాగా తీయడానికి ధైర్యసాహసాలు ఉండాలని.. ఈ ఒక్క నవల మాత్రం అమ్ముడు పోలేదని.. తాజాగా ఇది అమ్ముడుపోయి కల సాకారమైందని రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తెలిపారు.