పాతరికార్డులన్నీ చెరిపేసిన తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

0

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న జక్కన్న చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ టీజర్లు యూట్యూబ్లో రికార్డులు నమోదు చేశారు. చారిత్రక వీరులు మన్యం దొర అల్లూరి సీతారామరాజు గోండు బెబ్బులి కొమరం భీం జీవిత విశేషాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లూరి పాత్రలో చరణ్.. కొమ్రం భీం పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే అల్లూరిగా చరణ్ కనిపించిన టీజర్ భారీ రికార్డులను నమోదు చేసింది. దాని తర్వాత ఎన్టీఆర్ కుమ్రం భీం పాత్రలో కనిపించిన టీజర్ విడుదల కావడంతో పాత రికార్డులను అది చెరిపివేసింది.

టాలీవుడ్ లో మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ సాధించిన టీజర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ టీజర్ రికార్డులకెక్కింది. అంతేకాక వేగంగా 30 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి మరో రికార్డును నెలకొల్పింది. దీనితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో సెన్సేషనల్ రికార్డు వచ్చి పడింది. ఈ చిత్రంలో తారక్ సరసన ఒలీవియా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా నటుడిగా తన ఇమేజ్ను పెంచుకోనున్నాడు. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా తప్పకుండా తారక్ స్థాయిని మరో రేంజ్ కి తీసుకువెళుతుందని చెప్పవచ్చు.

అయితే విడుదలకు ముందే ఈ చిత్రంపై వివాదాలు మొదలయ్యాయి. సెకండ్ టీజర్లో ఎన్టీఆర్ (కుమ్రంభీం పాత్ర) ముస్లిం గెటప్లో కనిపించడం పట్ల ఆదివాసి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కుమ్రం భీంను ముస్లింగా చూపించడంతో వాళ్లు చాలా నొచ్చుకున్నారు. ఈ విషయంపై రాజమౌళి వివరణ ఇచ్చినప్పటికీ ఆదివాసీలు కోపం చల్లారలేదు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు టాక్. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారమేదీ రాలేదు.