అంటే సుందరానికి..’ అడల్ట్ టచ్

0

నాని హీరోగా మలయాళి ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో దీపావళి సందర్బంగా కొత్త సినిమాను మైత్రి మూవీమేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు అంటే సుందరానికి అన్న టైటిల్ ను ఖరారు చేసినట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్ విషయంలో త్వరలో అప్ డేట్ రాబోతుంది. బ్రోచేవారెవరురా అంటూ విభిన్నమైన కాన్సెప్ట్ తో కాస్త అడల్ట్ కంటెంట్ తో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాను చేసిన దర్శకుడు వివేక్ తాజాగా ప్రకటించిన నాని సినిమాను కూడా యూత్ ఆడియన్స్ టార్గెట్ గా చేయబోతున్నాడు.

నాని 28వ సినిమా అయిన అంటే సుందరానికి లో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అడల్ట్ కంటెంట్ ఉండబోతుందట. నాని ఫ్యామిలీ హీరో కనుక శృతి మించకుండా లైట్ అడల్ట్ టచ్ తో కామెడీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. నాని ఇప్పటి వరకు ప్రేక్షకులకు కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపిస్తాడని కూడా అంటున్నారు.

ఇక ఈ సినిమాలో నటించబోతున్న నజ్రియా విషయంలో కూడా తెలుగు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. ఈమె మలయాళం మరియు తమిళంలో బాగా ఫేమస్. అక్కడి సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా కొంత మందికి ఇప్పటికే చేరువ అయ్యింది. కనుక నానికి జోడీగా ఈమె సరి జోడి అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.