బోగన్ చిత్రంలోని రొమాంటిక్ ‘రా రా ఇటు రా’ వీడియో సాంగ్..!

0

తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి – సీనియర్ నటుడు అరవింద్ స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ”బోగన్”. అక్కడ హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. హన్సిక మొత్వానీ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. ఇటీవలే ‘బోగన్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మరియు ‘సింధూర’ సాంగ్ విడుదల చేయబడి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘బోగన్’ చిత్రం నుంచి ‘రా రా ఇటు రా’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘రా రా ఇటు రా రా.. నీ గమ్యం నీలో చూపిస్తా ఇటు రారా’ అంటూ సాగిన ఈ రొమాంటిక్ పాటకు ఇమ్మాన్ అద్భుతమైన ట్యూన్ అందించాడు. దీనికి తగ్గట్టు అశ్విన్ మరియు దీపికా కలిసి ఆలపించారు. ‘కళ్ళల్లోనా గుండెల్లోనా.. నువ్వుండగా.. నేను ఆగేదెట్టాగే..’ అంటూ ఈ ట్యూన్ కి ప్రముఖ లిరిసిస్ట్ భువనచంద్ర మంచి సాహిత్యాన్ని అందించాడు. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ రొమాంటిక్ మూడ్ కి తగ్గట్టు విజువల్స్ చూపించాడు. ఈ సాంగ్ లో జయం రవి – హన్సిక ఎంతో అందంగా కనిపిస్తున్నారు. కాగా ‘జయం’ రవి – అరవింద్ స్వామి కాంబోపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘బోగన్’ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారని అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.