Templates by BIGtheme NET
Home >> Cinema News >> పాపం ఇలియానా బెంగకు కారణమేంటో తెలుసా?

పాపం ఇలియానా బెంగకు కారణమేంటో తెలుసా?


ప్రతి గురువారం తన అభిమానులకు ఏదో ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వనిదే గోవా బ్యూటీ ఇలియానా నిదురపోదు. ఇన్ స్టా వేదికగా రకరకాల భంగిమలతో ఉన్న త్రోబ్యాక్ ఫోటోల్ని షేర్ చేస్తోంది. అవన్నీ ఇట్టే లక్షలాది ఫాలోవర్స్ లో వైరల్ అయిపోతున్నాయి. ఈసారి కూడా రెడ్ హాట్ ఫోటోని ఇల్లీ షేర్ చేయగా అది నెట్ ని షేక్ చేస్తూ వైరల్ అయ్యింది.

ఇది ఫిజీలో పర్యటించినప్పటి ఫోటో. ఒంటరి దీవిలో తన మాజీ ప్రియుడితో కలిసి షికార్ చేసినప్పటి ఫోటోషూట్ అని అర్థమవుతోంది. అయితే ఈ త్రోబ్యాక్ ఫోటోలో ఇలియానా షార్ట్ హెయిర్ తో కనిపిస్తోంది.
ఫిజీలోని తాబేలు ద్వీపంలో ఇలియానా కెమెరాకు పోజులిచిచ్చినపుడు ఎరుపు రంగు దుస్తులతో పాటు షార్ట్ హెయిర్ కనిపిస్తోంది. డార్క్ సన్ గ్లాసెస్ ధరించి చేతిలో పర్సు పట్టుకుని ఎలా ఫోజిచ్చిందో చూశారు కదా!

ఈ ఫోటోకి ఇలియానా క్యాప్షన్ ఆకట్టుకుంది. నేను నా సూపర్ షార్ట్ హెయిర్ మిస్ అయ్యాను.. బీచ్ లో లేకుండా చాలా మిస్ అయ్యాను! అంటూ బాధ పడిపోతోంది. అయితే గోవా బ్యూటీ మరీ అంతగా కలత చెందాల్సిన పనే లేదని గురువారం వచ్చిందంటే ఆగమాగం అయిపోవద్దని అభిమానులు ఇలియానాకు సోషల్ మీడియాల్లో సలహాలిస్తున్నారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇలియానా డి క్రజ్ చివరిసారిగా అనీస్ బజ్మీ చిత్రం పాగల్ పంథి (2019) లో కనిపించారు. ఈ చిత్రంలో జాన్ అబ్రహం సరసన ఇలియానా నటించింది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ `ది బిగ్ బుల్ `తో పాటు.. రణదీప్ హుడా అన్ ఫెయిర్ & లవ్లీ చిత్రాలలో కనిపిస్తుంది. ఇటు టాలీవుడ్ పైనా ఇలియానా ఆసక్తిగా ఉన్నా ఎందుకనో ఆఫర్లు రాలేదు.