Templates by BIGtheme NET
Home >> Cinema News >> `వండర్ ఉమెన్`నే తలపిస్తున్న నటవారసురాలు!

`వండర్ ఉమెన్`నే తలపిస్తున్న నటవారసురాలు!


అందానికి అందం .. చక్కని అభినయంతో తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకుంది సారా అలీఖాన్. ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అక్షయ్- ధనుష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి `అట్రాంగిరే` అనే చిత్రంలో సారా నటిస్తోంది.

ముంబై జుహులో జరిగిన చిత్రీకరణ అనంతరం సారా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చిందిలా. సారా క్రోమ్ బస్టియర్ ఎరుపు లెహంగా ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ మెటాలిక్ డిజైనర్ టాప్ తో సారా ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. ఈ గెటప్ లో వండర్ ఉమెన్ గాల్ గాడోట్ నే తలపిస్తోంది. ఈ ఆసక్తికర వేషధారణలోనే ముంబై స్టిల్ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. `ఇలా అంతా బావున్నాను కదా?` అంటూ స్టిల్ ఫోటోగ్రాఫర్లతో సారా సరదాగా వ్యాఖ్యానించి సారా స్మైల్ ఇచ్చారు.

అట్రాంగిరే రిలీజ్ కోసం వేచి చూస్తున్నామని ఫోటోగ్రాఫర్లు ఆ క్షణం ఎంతో ఆసక్తిని వ్యక్తం చేశారు. ఎంతో సరదాగా అందరితో కలుపుగోలుగా ఉండే నటీమణిగా ఒదిగి ఉండే నాయికగా సారాకు పరిశ్రమలో గుడ్ నేమ్ ఉంది. అది మరోసారి నిరూపణ అయ్యిందిలా.

2018 లో కేదార్ నాథ్ చిత్రంతో సారా అలీఖాన్ పరిశ్రమలో అడుగుపెట్టింది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటించారు. సింబాలో సహాయక పాత్రను పోషించింది. లవ్ ఆజ్ కల్- కూలీ నెంబర్ వన్ చిత్రాల్లోనూ సారా నటించింది. ప్రస్తుతం అట్రాంగి రే చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు