‘వి’ మూవీని మల్టీసారర్ గా ట్రీట్ చేయడం లేదా…?

0

నేచులర్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వి’ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. కానీ కరోనా ప్రభావం వల్ల థియేటర్స్ క్లోజ్ అవడంతో ‘వి’ వాయిదా పడింది. అయితే ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారో లేదో అని భావించిన మేకర్స్ ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ కి సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ‘వి’ మూవీని సెప్టెంబర్ 5న డిజిటల్ స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘వి’ ప్రమోషన్స్ విషయంలో ఇది కేవలం నాని సినిమా అనుకునే విధంగా ప్రచారం చేస్తున్నారని సుధీర్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయినట్లు తెలుస్తోంది.

కాగా ‘వి’ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి ఇది మల్టీస్టారర్ అని ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించిన తర్వాత ‘వి’ సినిమాని మల్టీస్టారర్ గా ట్రీట్ చేయడం లేదని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న ఓటీటీ వారు కేవలం నానితో మాత్రమే ప్రచారం చేయిస్తున్నారట. సూపర్ స్టార్ అల్లుడిగా మహేష్ బాబు బావగా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ బాబు.. ‘ప్రేమ కథా చిత్రమ్’ ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ ‘సమ్మోహనం’ వంటి మంచి హిట్స్ అందుకున్నాడని.. అలాంటిది ఇప్పుడు ‘వి’ ప్రమోషన్స్ విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాని నాని – సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ అనడం లేదని.. నాని ‘వి’ అని.. నాని 25వ చిత్రమని అంటున్నారని సుధీర్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట. నాని రేంజ్ లో కాకపోయినా తమ హీరో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడని.. సుధీర్ ని కూడా ప్రమోషన్స్ లో వాడుకుంటే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.

అయితే ‘వి’ సినిమాని రిలీజ్ చేస్తున్న అమెజాన్ వారికి ఇక్కడ ప్రొడక్షన్ టీమ్ మరియు నాని పర్సనల్ టీమ్ ‘వి’ సినిమాకి నాని మాత్రమే కీలకం అనే విధంగా ఫీడింగ్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో లోకల్ మార్కెట్ పై ఎలాంటి అవగాహన లేని అమెజాన్ వారు నాని మీదే ఫోకస్ చేసి ప్రమోషన్స్ చేస్తున్నారట. ఈ విషయంపై సుధీర్ బాబు ఫ్యాన్స్ ‘వి’ మేకర్స్ ని సంప్రదించగా ప్రమోషన్స్ కి మాకు సంబంధం లేదని.. రైట్స్ తీసుకున్న అమెజాన్ వారు చూసుకుంటున్నారని చెప్తున్నారట. ఓటీటీ వారు మాత్రం మాకు ప్రమోషన్ కంటెంట్ మొత్తం ప్రొడక్షన్ వారే ఇస్తున్నారనే సమాధానం చెప్తున్నారట. ఏదేమైనా మల్టీస్టారర్ మూవీలో ఒక హీరోకే ప్రాధాన్యత ఇస్తూ ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని.. సుధీర్ బాబు మీద కూడా ఫోకస్ పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.