నవ దంపతులు నితిన్ – షాలినికి వినాయకుని బ్లెస్సింగ్స్

0

వినాయక చతుర్థి పూజా పునస్కారాలతో సెలబ్రిటీలంతా ఇంటిల్లిపాదీ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. విఘ్నవినాయకుని చెంత ఫోటోలు దిగి సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు. మెగా దంపతుల ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.

తాజాగా హీరో నితిన్ .. అతని భార్య శాలిని కందుకూరి కలిసి హైదరాబాద్ లోని వారి నివాసంలో గణేష్ చతుర్థి పూజలు చేశారు. ఈ జంట పర్యావరణ అనుకూలమైన గణేశుడిని ఎంచుకుని నిష్ఠగా పూజించారు. నితిన్ ఏకంగా పూజారిగా మారి భార్య ముందు శ్లోకాలను జపించారు.

నితిన్ పక్కన కూర్చున్న షాలిని పూజా ప్రక్రియను శ్రద్ధగా గమనించారు. నితిన్ తల్లి విద్యా రెడ్డి పూజలో పాల్గొన్నారు. వినయక చవితి నవదంపతులు కలిసి జరుపుకున్న మొట్ట మొదటి పండుగ. నితిన్ – షాలిని వివాహం అనంతరం సెలబ్రేషన్స్ లో ఇది ఎంతో ముఖ్యమైనది కూడా. ఇక అన్ లాక్ ల అనంతరం షూటింగుల్ని వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రంగ్ దే రిలీజ్ కి రెడీ చేయాలి. అలాగే వరుసగా కమిట్ మెంట్లన్నిటి కోసం నితిన్ షెడ్యూలింగ్ సమయం కేటాయించాల్సి ఉంటుంది.