‘ఆచార్య’ మోషన్ పోస్టర్ రిలీజ్…!

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎన్నాళ్ళుగానో వేచిన తరుణం వచ్చేసింది. నేడు చిరు బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.

కాగా తాజాగా రిలీజైన ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో చేతిలో కత్తి పట్టుకొని ఉన్న చిరంజీవి బ్యాక్ సైడ్ లుక్ చూపించారు. ‘ధర్మస్థలి’ అనే అంశాన్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన ఈ మోషన్ పోస్టర్ చూస్తే ముందు నుంచి చెప్తున్నట్లు మంచి సందేశంతో ఈ మూవీ ఉండబోతోందని అర్థం అవుతోంది. దీనికి మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. సినిమాటోగ్రాఫర్ తిరు విజవల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆచార్య’ చిత్రాన్ని 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ కొరటాల శివ ట్విట్టర్ వేదికగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ”ధర్మం కోసం ఒక కామ్రేడ్ అన్వేషణ” అని పేర్కొన్నారు.