తన అందం విషయంలో ఇలియానా న్యూనత అంతగానా?

0

ఇలియానా డి క్రజ్ ఇటీవల కొంతకాలంగా నెటిజనుల నుంచి బాడీ షేమింగ్ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. చాలా మంది నటీనటుల మాదిరిగానే ఆమె అధిక బరువు సమస్యలతో పోరాడుతోంది. అకారణంగా ఎడతెరిపి లేని ట్రోలింగ్ తో చిక్కుల్లో పడుతోంది. తాజా ఇంటర్వ్యూలో కొంతకాలంగా తన ‘అందం లోపభూయిష్ట’ శరీరంపై బహిరంగంగా అంగీకరించే పనిలో పడింది.

ఇటీవల ఆమె శరీరాకృతిని తిరిగి తెచ్చేందుకు లా కష్టపడుతుందో తెలిపింది. తన పొట్ట భాగం ‘తగినంత ఫ్లాట్’ కాకపోవడం.. తన ముక్కు ‘సూటిగా సరిపోకపోవడం’.. చేతులు ‘చాలా జిగ్లీ’ గా ఉండడం.. ఇలా మరెన్నో విషయాలపై సుదీర్ఘమైన పోస్ట్ ను పంచుకుంది.

తన శరీరం లోపభూయిష్టంగా ఉందని అంగీకరించడానికి ఇప్పుడు అలవాటు పడుతున్నానని ఇలియానా అంది. “అంగీకారం అనేది నేను కొంతకాలంగా చేస్తున్న పని. అప్పుడే మనసు స్థిమితపడుతోంది. నేను ఆ సమయంలో చాలా పని చేస్తున్నాను. నన్ను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా.. ఉంచుకునే ప్రయత్నమిది అని తెలిపింది.

నన్ను నేను అద్దంలో చూస్తే కొంచెం ముద్దగా ఉన్నానని చూస్తే.. అది మామూలుగానే ఉంటుంది. కొన్ని మచ్చలున్నాయి. మనం ఖచ్చితంగా చెక్కిన విగ్రహాలు కాదని అర్థం చేసుకోవాలి. “నేను ఎలా ఉన్నానో అని ఎప్పుడూ ఆందోళన చెందుతుంటాను. నా టీథ్ చాలా వెడల్పుగా ఉన్నాయని.. నా థై బాగం ఫలానాలా ఉందని.. నా నడుము తగినంత ఇరుకైనది కాదు అని.. నా కడుపు చదునైనది కాదు అని.. నా వక్షోజాలు పెద్దవి కావు అని.. బట్ చాలా పెద్దది అని.. నా చేతులు చాలా జిగ్లీ ముక్కు సూటిగా లేదు అని.. పెదవులు సరిగా లేవు అని బాధపడేదానిని అంటూ చెప్పుకొచ్చింది.

“నేను ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదు. నేను అందంగా లోపభూయిష్టంగా ఉన్నాను“అని ఇలియానా అంది. ఇన్ని తెలిసాయి కాబట్టి… నేను అందం కోసం ప్రయత్నం చేయడం మానేశాను. నేను ఎందుకు అలా ఉండాలి ?? అని ప్రశ్నించుకున్నా అని ఇలియానా సుదీర్ఘంగా ఈ పోస్ట్ ను ఉంచడంతో అది అభిమానుల్లో వైరల్ గా మారింది. 8లక్షల లైక్ లు ఇప్పటికే దక్కాయి.