ఆఫర్ల కోసమే డోస్ పెంచేస్తోంది!

0

పవర్ స్టార్ నటించిన `కాటమరాయుడు` సినిమా తరువాత తెలుగులో కనిపించకుండా పోయింది శృతీహాసన్. మూడేళ్ల పాటు విరామం తీసుకుని మళ్లీ తమిళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ సేతుపతి నటిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలో నటిస్తోంది శృతి. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల సెట్లోకి చుట్టు పక్క గ్రామాల ప్రజలు గుంపులుగా వస్తున్నారని తెలిసి చెప్పా పెట్టకుండానే లొకేషన్ నుంచి ఎస్కేపై టీమ్కి షాకిచ్చింది.

ఇక తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ `క్రాక్`తో రీఎంట్రీ ఇస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో దిగుతోంది. ఈ మూవీతో పాటు పవర్ స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న `వకీల్ సాబ్`లో గెస్ట్గా మెరవబోతోంది. ఇదిలా వుంటే ప్రస్తుతం `క్రాక్` సాంగ్ షూట్ కోసం గోవా వెళ్లిన శృతి బీచ్ లో రెచ్చిపోయి అందాల విందు చేస్తోంది.

డోసు పెంచి టు పీస్ బికినీలో సందడి చేస్తోంది. ఉన్నట్టుండి శృతి హాట్ ఫొటో షూట్ కు పోజులివ్వడం కొంత మందికి షాకింగ్ గా వున్నా కొంత మంది మాత్రం ఆఫర్ల కోసమే శృతి ఫీట్లన్నీ అంటూ కామెంట్ చేస్తున్నారు. మూడేళ్ల విరామం తరువాత మళ్లీ బిజీ కావాలని స్టార్ నాయికగా మళ్లీ తన స్థానాన్ని సొంతం చేసుకోవాలనే శృతిహాసన్ హాట్ ఫొటో షూట్లకు పోజులిస్తోందని ఇన్ సైడ్ టాక్.