హీరో పాత్రలపై ఇంకా ఆశలు పెట్టుకునే ఉన్నాడా?

0

గత ఏడాది కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బెల్ బోటం’ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలువురు హీరోలను సంప్రదించిన తర్వాత చివరకు ఈ రీమేక్ సునీల్ వద్దకు వచ్చి ఆగిందట. కమెడియన్ గా సినీ కెరీర్ ను ఆరంభించి.. హీరోగా మారి కొన్నాళ్ల పాటు చేసి వరుసగా ప్లాప్ లు పడటంతో మళ్లీ కమెడియన్ గా మారిన సునీల్ ఈ సినిమా రీమేక్ కు ఎంపిక అయ్యాడనే వార్తలు వస్తుతం మీడియా సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నాయి.

కమెడియన్ గా మరియు విలన్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్న సునీల్ ఈమద్య కాలంలో స్క్రీన్ పై అంతగా సత్తా చాటలేక పోతున్నాడు. ఇలాంటి సమయంలో మళ్లీ హీరోగా ఆఫర్ రావడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. హీరోగా ఇంకా సునీల్ ఆశలు పెట్టుకునే ఉన్నాడని.. ఈ సినిమాతో మళ్లీ ఏమైనా అద్బుతం జరిగితే హీరోగా బిజీ అయ్యే అవకాశం ఉంటుందని ఆయన ఆశ పడుతున్నాడట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండే బెల్ బోటంను ఎక్కువగా మార్పులు చేర్పులు లేకుండా రీమేక్ చేయడం వల్ల సునీల్ కు కనీసం ఒక మీడియం రేంజ్ సక్సెస్ అయినా సునీల్ కు దక్కుతుందని ఆయన అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ రీమేక్ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.