ఇస్మార్ట్ బ్యూటీ ట్రెడీషనల్ లుక్

0

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్ మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ యాసతో పక్కా మాస్ అమ్మాయిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఆకట్టుకునే రూపంతో పాటు నటనలో మంచి ప్రావిణ్యం ఉన్న ఈ అమ్మడు ఏ కాస్ట్యూమ్ లో అయినా కూడా అందంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ఈమె ఈ ట్రెడీషనల్ ఫొటోను షేర్ చేసింది. మీరు పండుగలను వీడకూడదనుకున్నప్పుడు అంటూ ఆ ఫొటోకు కామెంట్ పెట్టింది. పండుగ మూడ్ లోనే నభా ఉన్నట్లుగా ఈ ఫొటోను చూస్తే అర్థం అవుతుంది. పండుగకు వేసుకున్న ఈ కాస్ట్యూమ్ ఆమెకు బాగా నచ్చిందేమో అందుకే వీడాలనిపించడం లేదు అంటూ కామెంట్ పెట్టింది.

ఇక ప్రస్తుతం నభా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఈ అమ్మడు గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తూ ఉంది. కరోనా లాక్ డౌన్ వల్ల ఈమె ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేక పోయింది. లేదంటే ఈ ఏడాది కనీసం రెండు సినిమాలు అయినా ఈమె నుండి వచ్చేవి అనడంలో సందేహం లేదు.