పెళ్లి కూతురుగా చందమామ కాజల్

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. రేపు గౌతమ్ ను కాజల్ వివాహమాడబోతుంది. వీరిద్దరి వివాహ నిశ్చితార్థం సింపుల్ గా జరిగి పోయింది. పెళ్లి కూడా కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో జరుగబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే పెళ్లికి పెద్దగా హడావుడి లేకుండా ఇండస్ట్రీ వారిని పిలవకుండానే కాజల్ పెళ్లి జరిగి పోతుంది. కాజల్ పెళ్లి వేడుకలు గత రెండు మూడు రోజులుగా సాగుతున్నాయి. సంగీత్.. మెహెందీ వేడుకతో పాటు నేడు కూడా కాజల్ ఇంట సందడి వాతావరణం నెలకొంది.

నేడు కాజల్ పెళ్లి కూతురు అయిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. కాజల్ ను పెళ్లి కూతురును చేయించడం మరియు మంగళ స్థానం చేయిస్తున్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ పెళ్లి ఫొటోలు అధికారికంగా బయటకు రాకున్నా సన్నిహితులు కుటుంబ సభ్యులు తీసిన ఫొటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానుల వద్దకు చేరాయి.

రేపు కాజల్ పెళ్లి తర్వాత అధికారికంగా ఫొటోలను షేర్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాజల్ మెహెందీకి సంబంధించిన ఒక్క ఫొటోను మాత్రమే షేర్ చేసింది. అయితే కాజల్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పెళ్లి ఫొటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. వాటిని మీరు ఒక లుక్కేయండి.