Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఏ యాంగిల్ లోనూ తగ్గని జూ.అతిలోక సుందరి

ఏ యాంగిల్ లోనూ తగ్గని జూ.అతిలోక సుందరి


అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ వరుస ఫోటోట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. జాన్వీ ఇటీవల తన అద్భుతమైన ఫోటోలతో ఇంటర్నెట్ లో కలకలం రేపుతోంది. హాట్ కంటెంట్ విషయంలో ఏమాత్రం తగ్గని అథ్లెటిజర్ దుస్తులు ధరించడంలో జిమ్ స్పోర్ట్స్ వేర్ ని ధరించడంలో స్పెషలిస్ట్ అని ప్రూవైంది. మాల్దీవుల విహారం మొదలు వేడెక్కించే ఫోటోషూట్లతో జాన్వీ.. ప్రతి ఒక్కరికీ విస్మయం కలిగిస్తోంది.

తాజాగా లేత గోధుమరంగు హాట్ బాడీకాన్ డ్రెస్ లో జాన్వీ తన స్పెషల్ ఫోటోలను పోస్ట్ చేసింది. రకరకాల భంగిమల్లో జాన్వీ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. అభిమానులు ఈ ఫోటోలకు వైరల్ గా కామెంట్లు చేస్తున్నారు. షానయ కపూర్ హార్ట్ ఎమోజీలు.. ఫైర్ ఎమోజీలను షేర్ చేయగా.. మహీప్ కపూర్ ఫైర్ హార్ట్-ఐ ఎమోజీలను షేర్ చేశారు.

ఇటీవలి కాలంలో జాన్వీ ఫోటోషూట్లు తనలోని బోల్డ్ యాంగిల్ ని ఆవిష్కరించాయి. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వి నటించిన `దోస్తానా 2` చిత్రం సెట్స్ పై ఉంది. కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రం నుండి నిష్క్రమించినట్లు ధర్మ సంస్థ ప్రకటించడంతో దోస్తానా 2 హెడ్ లైన్స్ లోకి వచ్చింది. తదుపరి జాన్వీ మరిన్ని భారీ చిత్రాల్లో నటించనుంది.