బాలయ్యకు జోడీగా జయప్రద?

0

నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్ ముద్దుగుమ్మను రంగంలోకి దించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు. రెండు పాత్రల్లో ఒక పాత్ర సీనియర్ హీరోయిన్ జయప్రద జోడీగా కనిపించబోతుందట. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన జయప్రద ఈమద్య కాలంలో సినిమాల్లో కనిపించడం లేదు.

బాలకృష్ణ సినిమా కోసం బోయపాటి ఆమెను సంప్రదించగా పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఉన్న కారణంగా ఓకే చెప్పారట. బోయపాటి మరియు బాలయ్యల కాంబోకు ఉన్న క్రేజ్ కారణంగా కూడా జయప్రద ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తుంది. లాక్ డౌన్ కు ముందు షూటింగ్ ప్రారంభం అయ్యంది. ఆరు నెలలుగా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ లో మార్పులు మరియు చేర్పులు కూడా చేశారంటూ సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే సినిమాలో కీలక పాత్రకు గాను జయప్రదను తీసుకోవాలని భావించారట. అందుకు ఆమె ఓకే చెప్పడంతో సినిమా వెయిట్ మరింతగా పెరిగినట్లయ్యింది. ఒకటి రెండు నెలల్లో సినిమాను షూటింగ్ ను పునః ప్రారంభించి వచ్చే ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే బిబి3 విషయమై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.