వర్మ సినిమాల మాదిరిగా రాబోతున్న ‘సోలో బ్రతుకే సోబెటర్’

0

థియేటర్ లు ఆరు నెలలుగా మూతపడి ఉన్న కారణంగా పలు సినిమాలై డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఓటీటీలో కొత్త తరహాలో రామ్ గోపాల్ వర్మ తన సినిమాలను తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే ఆయన తన పలు సినిమాలను పే పర్ వ్యూ అనే పద్దతిలో విడుదల చేశాడు. చిన్న సినిమాలకు టికెట్లు పెట్టిన వర్మ లక్షల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు ఆయన దారిలోనే మరికొందరు స్టార్స్ కూడా తమ సినిమాలను పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను కూడా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయబోతున్నారట.

ప్రముఖ ఓటీటీ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు పే పర్ వ్యూ ను పెట్టి వచ్చిన లాభాల్లో షేర్ తీసుకునే విధంగా మాట్లాడుకున్నారట. ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రయోగాత్మకంగా వ్యవహరించబోతున్నారు. ఈ పద్దతిలో సక్సెస్ అయ్యి నిర్మాతకు లాభాలు వస్తే ముందు ముందు పెద్ద సినిమాలు కూడా ఇదే పద్దతిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే అప్పటికే సబ్స్ర్కిప్షన్ పెట్టిన వారు మళ్లీ డబ్బు చెల్లించేందుకు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు చిన్న సినిమాలు మాత్రమే పే పర్ వ్యూ పద్దతిలో వచ్చాయి. వర్మ సినిమాలతో పాటు షకీలా నిర్మించిన సినిమా కూడా ఇలా పే పర్ వ్యూ లో విడుదల అయ్యాయి. మరి సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు ఈ పద్దతి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందో చూడాలి.