వర్కౌట్ లతో రెస్ట్ లెస్ గా చేసిందట!

0

రాశిఖన్నా హైదరాబాద్ లో సెటిలైన దిల్లీ అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయినా కుర్రహీరోలతో ఆఫర్లు అయితే కొదేవేమీ లేదు. `జై లవ కుశ`లో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నా పెద్దగా రాశికి ఒరిగిందేమీ లేదు. రీసెంట్ గా చేసిన `వరల్డ్ ఫేమస్ లవర్` దారుణంగా ఫ్లాపై నిరాశను కలిగించింది. దీంతో చాలా కాలానికి.. తెలుగులో రాశికి అవకాశాలు దక్కడం కష్టంగా మారింది.

ప్రస్తుతం రాశిఖన్నా తమిళ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. `అరణ్మనై 2`తో పాటు సిద్ధార్ధ్ తో కలిసి `సైతాన్ కా బచ్చా` చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మళ్లీ తన సత్తాని చాటాలని కొత్త కొత్త వర్కవుట్ లు చేస్తోంది. తాజాగా జిమ్ లో తన ఫేవరేజ్ బెంచ్ పై వర్కవుట్ లు చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది రాశి.

నా అభిమాన బెంచ్ పై రిలాక్స్ డ్ గా ఈ వారం ముగియడం ఆనందంగా వుంది. కుల్దీప్ సేతి నన్ను మొత్తం వారం మొత్తం తనని గ్రిల్లింగ్ వర్కౌట్ లతో రెస్ట్ లెస్ గా చేసిందని కామెంట్ చేసింది. ఇంత వర్కవుట్లు చేసినా నో పెయిన్ నో గెయిన్ అని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.