ఇంత‌లోనే ట్విస్ట్.. జూ.ఐష్ వివాహేత‌ర సంబంధం..!

0

సింహా- నేను మీకు తెలుసా- కరెంట్ వంటి చిత్రాల్లో నటించింది స్నేహా ఉల్లాల్. ఆ తర్వాత తెలుగులో ఎందుకనో పెద్దంత వెలగలేదు. అలా మొదలైంది లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినా క్రెడిట్ మొత్తం రింగుల జుత్తు నిత్యామీనన్ కొట్టేసింది. ఆ తర్వాత స్నేహా కెరీర్ కోసం చాలా పాకులాడినా టాలీవుడ్ లో ఎవరూ ఎంకరేజ్ చేయలేదు.

ఆ క్రమంలోనే బాలీవుడ్ లోనే తన ప్రయత్నాలు సాగించింది. కానీ అక్కడా ఏదీ కలిసిరాలేదు. ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ ఏం చేస్తోంది? అంటే ఈ భామ వెబ్ సిరీస్ లపై దృష్టి సారించిందని సమాచారం. స్నేహ ఉల్లాల్ తెలుగులో సినిమాలు చేయాలని సిద్ధంగానే ఉందిట. అప్పట్లో రకరకాల ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాల నుండి తాత్కాలిక విరామం తీసుకున్నానని తెలిపింది. ఇప్పుడు ఆమె డిజిటల్ స్పేస్ లోకి ప్రవేశిస్తున్నానని వెల్లడించింది.

అక్టోబర్ 2 న జీ5 లో విడుదల కానున్న థ్రిల్లర్ `ఎక్స్ పైరీ డేట్`లో స్నేహా ఉల్లాల్ ట్రీట్ స్పెషల్ గా ఉంటుందట. ఇందులో మధు షాలిని – టోనీ లూకాతో జతకట్టింది. యాదృచ్ఛికంగా ఈ సిరీస్ కు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ ఈ సిరీస్ ను నిర్మిస్తోంది.

ఈ ముగ్గురితో పాటు బిగ్ బాస్ ఫేం అలీ రెజ్ .. జెనిఫర్ పిక్కినాటో కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. రెండు జంటలు వారి వివాహేతర సంబంధాల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతోంది.