ముంబై సెలూన్ లో లుంగీ రౌడీ.. పక్కనే అమ్మాయి ఎవరు?

0

ఫ్యాషన్ అనుకరణలో ఎనర్జిటిక్ బోయ్ రణవీర్ సింగ్ కి ఏమాత్రం తగ్గడు మన దేవరకొండ. ఇటీవల గత కొన్ని సినిమాలకు అతడు ప్రమోషన్స్ కోసం ఎంచుకున్న మార్గం అందరికీ తెలిసిందే. వెరైటీ వెరైటీ డిజైనర్ డ్రెస్సుల్లో కుర్రకారులో కి దూసుకెళ్లిపోయాడు. కొన్నిసార్లు తిట్లు చీవాట్లు ఎదురైనా కానీ.. చాలా సార్లు పొగడ్తలు కూడా అందుకున్నాడు. ఇక తన పంథాని ప్రచార సరళిని దేవరకొండ మార్చుకునేందుకు ఇష్టపడడం లేదు.

అప్పట్లో మనీష్ మల్మాత్రా సారథ్యంలో ఫోటోషూట్ తోనూ దేవరకొండ ముంబై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. పొడవాటి గిరజాల జుత్తు పెంచి అల్ట్రా మోడ్రన్ ఫోటోషూట్ తో అలరించాడు. ఆ క్రమంలోనే కరణ్ జోహార్ తో టచ్ లోకి వెళ్లి పూరి యాక్షన్ మూవీ `ఫైటర్` ని మరో లెవల్ కి తీసుకెళ్లాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఫైటర్ లో నటిస్తున్న విజయ్ లాక్ డౌన్ వల్ల బ్రేక్ తీసుకున్న సంగతి విధితమే.

ఇక ముంబైలోనే అప్పట్లో లాక్ అయిపోయిన ఫైటర్ టీమ్ చాలా ఇబ్బందులు పడింది. ఆ సమయంలో ఓ హెయిర్ సెలూన్ కి రౌడీ ఏకంగా లుంగీతో దిగిపోయాడు. అందుకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సింపుల్ గా సామాన్యుడి లుంగీ కట్టుకున్న దేవరకొండ కాంబినేషన్ చొక్కా తొడిగి అదరహో అనిపించాడు. ఆయన వెంటే ఒకమ్మాయి ఉన్నారు? ఎవరావిడ? అన్నది ఆరా తీస్తే .. ఇంకెవరు.. ఫైటర్ నిర్మాతల్లో ఒకరైన ఛార్మినే. తన హీరోతో కలిసి అలా ముంబైలో షికార్లు చేశారు ఛార్మి. చిరునవ్వులు చిందిస్తూ ఎంత ఆహ్లాదాన్ని పంచారో చూసారుగా. అన్నట్టు ఫైటర్ చిత్రీకరణ ఎంతవరకూ వచ్చింది? అంటే ముంబైలో సెట్స్ పడగొట్టి.. హైదరాబాద్ లో నిర్మించిన సెట్స్ లో పని కానిచ్చేస్తున్నారని ఇటీవల ప్రచారమైంది.