స్టార్స్ అంతా ఆ దర్శకుడి వెనుక పడుతున్నారు

0

గత ఏడాది కార్తీ నటించిన ఖైదీ చిత్రంతో తమిళం మరియు తెలుగు ఆడియన్స్ దృష్టిని మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మరియు ప్రముఖుల అభిమానం దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈయన ప్రస్తుతం సూపర్ స్టార్ విజయ్ తో ‘మాస్టర్’ చిత్రం చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి అయిన సినిమా విడుదలకు రెడీ అవుతుంది. కరోనా కారణంగా మాస్టర్ ఆలస్యం అవుతోంది. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే మైత్రి మూవీస్ బ్యానర్ లో ఈయన సినిమా ఉంటుందని అంటున్నారు.

మైత్రి మూవీస్ వారు భారీ అడ్వాన్స్ ఇచ్చి మరీ ఈ దర్శకుడిని బుక్ చేశారు. స్టార్ హీరోతో ఈ సినిమాను చేసేందుకు మైత్రి వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలోనే లోకేష్ కనబరాజ్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఈసారి తమిళ స్టార్ హీరో సూర్య హోమ్ బ్యానర్ అయిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లో ఈయన సినిమా ఉండబోతుంది. హీరో ఎవరు సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో క్లారిటీ లేదు. కాని సూర్య బ్యానర్ లో లోకేష్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని మాత్రం తమిళ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే ఖైదీ చిత్రాన్ని చేసిన లోకేష్ మరియు కార్తీలు మరోసారి జత కలిసి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో ఆయన సూర్యతో సినిమా చేస్తాడని మరికొందరు భావిస్తున్నారు. మాస్టర్ విడుదల అయితే తప్ప లోకేష్ తదుపరి చిత్రం ఏంటీ అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈయన చేయబోతున్న సినిమాలో హీరో ఎవరు అనే విషయమై కూడా ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ దర్శకుడి వెంట స్టార్ హీరోలు మరియు నిర్మాతలు పడుతున్నారు. మరి ఈయన తర్వాత సినిమా ఎరితో చేస్తాడో చూడాలి.