Templates by BIGtheme NET
Home >> Cinema News >> బట్టలు పోగొట్టుకుంది.. కొనిస్తామని వెంబడిస్తున్న ఫ్యాన్స్

బట్టలు పోగొట్టుకుంది.. కొనిస్తామని వెంబడిస్తున్న ఫ్యాన్స్


`ఆదిత్య వర్మ` సినిమాతో సౌత్ కి.. `అక్టోబర్` అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అయ్యింది బనితా సందు. ఈ అమ్మడి నటన హావభావాలు చూసి మంచి భవిష్యత్ ఉందంటూ క్రిటిక్స్ ప్రశంసించారు. నటించిన రెండు సినిమాల్లోనూ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో బానిట మ్యాజిక్ చేసింది. ఇక ఈ అమ్మడి అందానికి ఫిదా అవ్వని అభిమాని లేడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మలో నటించడం బానిటకు పెద్ద ప్లస్ అయ్యింది.

ప్రస్తుతం ఉత్తరాది పరిశ్రమ సహా ఇటు సౌత్ లోనూ అవకాశాలొస్తున్నాయి. ఇటీవల ఓ తెలుగు సినిమాకి ఈ అమ్మడి పేరును పరిశీలించారని వార్తలొచ్చాయి. అదంతా అటుంచితే… బానిట ఇతర టాప్ మోడల్స్ హీరోయిన్ల తరహాలోనే సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. బానిట షేర్ చేసిన తాజా ఫోటోషూట్ కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని రేంజులో ట్రీటిస్తోంది.

పైగా ఈ ఫోటోషూట్ కి `బట్టలు పోగొట్టుకున్నా!` అంటూ వేడెక్కించే క్యాప్షన్ ఇవ్వడంతో కుర్రాళ్లు కామెంట్లతో చెలరేగిపోతున్నారు. అయ్యో పాపం బట్టలు కొనిస్తాం! అంటూ రివర్స్ గా అమ్మడిని ఆటపట్టించేస్తున్నారు. అయితే కొందరు డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం మరీ ఇంతగా చెలరేగిపోవడం సరికాదని తనకు సూచిస్తున్నారు. తనంటే గౌరవం ఉందని ఇలాంటి ఫోటోషూట్లు వద్దని రెక్వస్ట్ చేశారు కొందరు.

వేడెక్కించే ఫోటోషూట్ తో టాప్ లేపేసిన ఈ అమ్మడి పేరు మళ్లీ మార్మోగుతోంది. బాలీవుడ్ లో యూరి ఫేం విక్కీ కౌశల్ సరసన `సర్దార్ ఉద్ధమ్ సింగ్` అనే సినిమాకి సంతకం చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ఓ తమిళ సినిమాకి ఓకే చెప్పిందని సమాచారం.