చందమామ అందం చూడాలంటే రెండు కళ్లు చాలవు

0

కోక రవికెలో సాంప్రదాయ చీరకట్టులో కాజల్ ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందే ఇప్పటికే పెద్ద తెరపై చూసిన అభిమానులకు ఇదో డిఫరెంట్ ట్రీట్. రొటీన్ కి భిన్నంగా కాజల్ లేటెస్ట్ ఫోటోషూట్ హీట పెంచేస్తోంది.

తాజాగా వంగపువ్వు రంగు జెరీ అంచు చీరలో చందమామ తళుకుబెళుకులు యూత్ లో హాట్ టాపిగ్గా మారాయి. నీలాకాశపు నీలిరంగుతో మిరుమిట్ల జాకెట్ పై ఆ వంగపువ్వు చీర కాంబినేషన్ అదరహో అన్నట్టుగానే సెట్టయ్యింది. ఇక తీరైన రూపానికి తగ్గ లైటర్ మేకప్ .. లేత పెదవులకు కాంబినేషన్ మేకప్ .. కొంటెగా చూపులతో కాజల్ కట్టి పడేస్తోంది. ఆ తలలో తురిమిన పూల చెండు చూశారుగా.. రకరకాల రంగుల్లో అప్పుడే వికసించిన పుష్పాల్ని చందమామ చెంపల మీదుగా అలంకరించిన తీరు వ్వావ్ అనిపిస్తోంది.

ఇంతకుముందు మేకప్ లెస్ రూపమిదే.. ఒరిజినల్ గా నేనిలానే ఉంటాను! అంటూ కాజల్ రియాలిటీ ఫోటోషూట్ అభిమానుల్ని షాక్ కి గురి చేసింది. మేకప్ లేకుండా తన లుక్ ఎలా ఉన్నా అభిమానుల్ని తన ప్రయత్నం ఆకట్టుకుంది. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యం ఎంతో గొప్పది! అని కాజల్ ఇచ్చిన సందేశం దూసుకెళ్లింది. ఇక కెరీర్ సంగతి చూస్తే.. కాజల్ ప్రస్తుతం భారతీయుడు 2లో నటిస్తోంది. తదుపరి పలువురు అగ్ర కథానాయికల సినిమాలకు సంతకాలు చేయనుందని ఇటీవల కథనాలొస్తున్నాయి. తమిళ సినిమాలకు సంబంధించి తాజా అప్ డేట్ రావాల్సి ఉంది.