పెళ్లికి ముందే భయపెట్టావ్గా కాజల్!!

0

ఓటీటీలు.. వెబ్ సిరీస్ ల హవా అంతకంతకు పెరుగుతుంటే స్టార్లు అటువైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలతో పాటు కథానాయికలు వెబ్ సిరీస్ బాట పట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందాల కియారా అద్వానీ.. రాధిక ఆప్టే ఇప్పటికే వెబ్ సిరీస్ బాటలో నిరూపించుకున్నారు. మునుముందు సమంత.. తమన్నా.. కాజల్ ఇదే బాటలో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక కాజల్ సైతం వెబ్ సిరీస్ తో అదరగొట్టేందుకు సిద్దమవుతోంది. ఇందులో కాజల్ భూతప్రేతంలా మారి భయపెట్టేయబోతోంది. తన కెరీర్ జర్నీలో ఇంతవరకూ లేనంత కొత్తగా కాజల్ కనిపించబోతోంది. అక్టోబర్ 30 తాను వలచిన గౌతమ్ కిచ్లూని పెళ్లికి ముందే భయపెట్టేసేందుకు కాజల్ ప్రిపేరవుతుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ టైటిల్ `లైవ్ టెలీకాస్ట్`. ఫస్ట్ లుక్ లో కాజల్ రూపం చూసి ఝడుసుకుంటున్నారంతా. మునుపెన్నడూ చేయని డిఫరెంట్ రోల్ తో కాజల్ సర్ ప్రైజ్ చేయబోతోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ థ్రిల్లింగ్ కథగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మొత్తం ఏడు ఎపిసోడ్స్గా ఈ సిరీస్ అలరించనుంది.

కాజల్ – వైభవ్ – ఆనంది తదితరులు నటిస్తున్న ఈ సిరీస్ అతి త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ లుక్ చూడగానే పెళ్లికి ముందే భయపెట్టేస్తున్నావ్ గా! అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.