పెళ్లికూతురు కాజల్ పింక్ లెహంగా మేకింగ్ స్టోరి

0

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన సంగతి తెలిసినదే. అక్టోబర్ 30న ఈ వివాహం జరిగింది. చూడముచ్చటైన జంట అంటూ దేవతలు సహా అభిమానులు ఆశీర్వదించారు. ఇక ఈ పెళ్లిలో హైలైట్ ఏమిటి? అంటే కాజల్ ధరించిన పింక్ లెహెంగా.. పెళ్లికొడుకు కిచ్లు ధరించిన డిజైనర్ షెర్వాణీ డ్రెస్.. అందరి దృష్టిని ఆకర్షించాయి. వీటికోసం వ్యయప్రయాసలు ఏపాటి? అన్నది ఆరా తీస్తే చాలా ఆసక్తికర సంగతులే తెలిసాయి.

పెళ్లిలో కాజల్ పింక్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది. అందుకు సంబంధించిన ఛాయాచిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ దీనిని డిజైన్ చేసినది ఎవరు? అన్నది ఆరా తీస్తే.. లెహంగాను ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా రూపొందించారు. కాజల్ లెహెంగాపై సంక్లిష్టమైన జర్డోసి ఎంబ్రాయిడరీ పూల నమూనాను రూపొందించడానికి దాదాపు 20 మందికి ఎంతో సమయం పట్టిందట. అలాగే ఆభరణాలను సునీతా శేఖవత్ రూపొందించారు.

అలాగే వరుడు గౌతమ్ కిచ్లు అనితా డోంగ్రే రూపొందించిన తెలుపు రంగు షేర్వాణీనీని ధరించారు. దీని విలువ రూ .1.15లక్షలు. కాజల్ తన మెహెంది ఫంక్షన్ లో అనితా డోంగ్రే డిజైన్ చేసిన ఆకుపచ్చ రంగు కుర్తా ధరించింది. దీని విలువ రూ 25వేలు అని తెలుస్తోంది. ఖరీదైన డిజైనర్ దుస్తుల్లో నవ వధువు వరుడు పెళ్లి మంటపానికే కొత్త కళ తెచ్చారని అంతా గుసగుసలాడేయడం ఆసక్తిని రేకెత్తించింది.