ప్రభాస్ మూవీలో మహేష్ హీరోయిన్ కావాలంటున్న ఫ్యాన్స్..!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆదిపురుష్” అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇతిహాస రామాయణం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ ‘రాముడి’గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ ‘లంకేష్’ గా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ‘సీత’ పాత్రలో ఏ హీరోయిన్ నటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అనేకమంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఎవరికైతే బాగుంటుందనే దానిపై క్లారిటీగా ఉన్నారని తెలుస్తోంది.

‘ఆదిపురుష్’ లో నటించబోయే హీరోయిన్ అంటూ అనుష్క శెట్టి – అనుష్క శర్మ – కీర్తి సురేష్ – కృతిసనన్ వంటి పేర్లు చర్చకు వచ్చాయి. అయితే ఇప్పటివరకు మేకర్స్ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో కచ్చితంగా అన్ని ఇండస్ట్రీలలో గుర్తింపు ఉన్న హీరోయిన్ నే తీసుకోవాలని చిత్ర యూనిట్ డిసైడైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘సీత’ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ని తీసుకుంటే బాగుంటుందని డార్లింగ్ హీరో ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందంతో పాటు అభినయం కలబోసిన కియారా అయితే ప్రభాస్ కటౌట్ కి సెట్ అవుతుందని వారు అంటున్నారు. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో కియారా టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరి మేకర్స్ ఈ ధోని బ్యూటీని తీసుకుంటారో మరో ముద్దుగుమ్మని ఫిక్స్ చేస్తారో చూడాలి. ఈ సినిమాలో సీనియర్ నటి అజయ్ దేవగన్ సతీమణి కాజోల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. ‘ఆదిపురుష్’ ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేయనున్నారు.