నితిన్ ‘రంగ్ దే’ నుంచి రాబోతున్న ‘ఏమిటో ఇది’ లిరికల్ సాంగ్

0

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రంగ్ దే”. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ‘తొలి ప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ‘రంగ్ దే’ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తున్నారు.

‘రంగ్ దే’ చిత్రం కోసం దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘ఏమిటో ఇది..’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రీ ల్యూడ్ నవంబర్ 5న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. కాగా నితిన్ – కీర్తి సురేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి లెజెండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్ లు తిరిగి ప్రారంభం కావడంతో.. ఈ మూవీ కూడా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. నెక్స్ట్ ప్లాన్ చేసిన షెడ్యూల్ లో ‘రంగ్ దే’కి సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు సాంగ్ కూడా షూట్ చేస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటున్నారు.