‘చందమామ’ కాజల్ పెళ్లి ఫోటోలు…!

0

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగిపోయింది. యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఆమె వివాహం వైభవంగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన కాజల్ పెళ్లి నేడు (అక్టోబర్ 30న) జరిగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సభ్యులు పరిమిత సంఖ్యలో సన్నిహితులు అతిథుల సమక్షంలో కాజల్ – తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు వేసినట్లు తెలుస్తోంది. ముంబైలో ఓ ప్రైవేట్ వేడుకగా కాజల్ వివాహం జరిపించారు. కాజల్ పెళ్లి పూర్తైన తర్వాత వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలు కాజల్ – గౌతమ్ కిచ్లూ లు పెళ్లి అనంతరం వివాహ వేదికపై నిలబడినప్పుడు తీసినవిగా తెలుస్తోంది. కాజల్ – గౌతమ్ ల జంట పెళ్లి దుస్తుల్లో ముస్తాభై సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన కాజల్ అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచి జరిగిన మెహందీ – హల్దీ ఫంక్షన్లకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. పెళ్ళికి కొన్ని గంటల ముందు కూడా ‘తుఫాన్ కి ముందు ఉండే నిశ్శబ్ధం’ అని తెలుపుతూ.. సైలెంటుగా ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుని ఉన్న పిక్ ని కాజల్ పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఫొటోలో మాత్రం భర్త పక్కన నిలబడి చాలా సంతోషంగా కనిపిస్తోంది కాజల్.