సముద్ర గర్బంలో హనీమూన్ కపుల్ కాజల్ కిచ్లు

0

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాల్దీవుల్లో భర్త గౌతమ్ కిచ్లుతో హనీమూన్ లో ఉన్న విషయం తెల్సిందే. అక్కడ నుండి రెగ్యులర్ గా ఫొటోలను షేర్ చేస్తూ తాను అక్కడి అందాలను ఆస్వాదించడం మాత్రమే కాకుండా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కు ఇతర నెటిజన్స్ కు కూడా మాల్దీవ్ ల అందాలను చూపిస్తుంది. అక్కడి బ్లూ సీ అందాలను ఇప్పటికే పదుల కొద్ది షేర్ చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు అండర్ సీ ఫొటోలను షేర్ చేసింది. భర్త గౌతమ్ తో కలిసి కాజల్ నీటిలోపల స్విమ్ సూట్ లో తిరిగారు.

కాజల్ మరియు గౌతమ్ ల హనీమూన్ పిక్స్ గతంలో ఎవరివి ఎప్పుడు వైరల్ కానంతగా వైరల్ అవుతున్నాయి. గత వారం పది రోజులుగా వారి రొమాంటిక్ పిక్స్ మరియు హనీమూన్ పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈసారి కాజల్ ఏకంగా అండర్ వాటర్ లో భర్తతో కలిసి ఫొటో షూట్ ఇచ్చింది. ఇలాంటి ఫొటోలు ఇప్పటి వరకు ఎప్పుడు చూసింది లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్స్ పెళ్లి ఫొటోలు హనీమూన్ ఫొటోలు షేర్ చేయడం చాలా కామన్. కాని కాజల్ కుచ్లు జంట మాత్రం ఓ రేంజ్ లో తమ ఫొటోలను షేర్ చేస్తూ గత 20 రోజులుగా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తున్నారు. పెళ్లికి ముందు నుండి హనీమూన్ పిక్స్ వరకు అన్ని కూడా సోషల్ మీడియాలో వీరు షేర్ చేసుకుంటూనే ఉన్నారు.