హాట్ బ్యూటీని అంతా మర్చిపోయారు!

0

‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది రెజీనా కసాండ్రా. ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తమిళ కన్నడ సినిమాల్లోనూ ప్రయత్నాలు చేసింది. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా.. అమ్మడికి స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కలేదు. దీంతో నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ తో పాటు గ్లామర్ రోల్స్ కు కూడా రెడీ అయింది. ఈ క్రమంలో ‘ఎవరు’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు అలానే బోల్డ్ క్యారెక్టర్లు వేయడం స్టార్ట్ చేశాక రెజీనా మళ్లీ రైజింగ్ లోకి వస్తుందని అందరూ భావించారు. కానీ అమ్మడికి ఇక్కడ చెప్పుకోదగ్గ ఆఫర్స్ మాత్రం రాలేదు.

రెజీనా ‘ఎవరు’ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. అదే సమయంలో ఈ భామకు తమిళ్ లో మాత్రం వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కోలీవుడ్ లో అర డజను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఎమర్జింగ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ‘సూర్పనాగై’ ‘నెంజమ్ మరప్పతిల్లై’ ‘పార్టీ’ ‘చక్ర’ ‘కళ్లపార్ట్’ ‘కసాదా తపర’ వంటి సినిమాల్లో రెజీనా నటిస్తోంది. ఐతే తెలుగులో మాత్రం ఇంతవరకు రెజీనా నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అప్డేట్ లేదు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించనుందని వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు దీని గురించి అధికారిక ప్రకటన లేదు. దీంతో ప్రేక్షకులు ఈ బ్యూటీని ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ‘సూర్పనాగై’ ‘చక్ర’ వంటి డబ్బింగ్ సినిమాలతో ఆడియన్స్ ని పలకరించనున్న రెజీనా కి ఇకపై తెలుగి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.