బాలయ్య ఇంత పెద్ద బాంబు పేల్చాడేంటి

0

కరోనా కు వ్యాక్సిన్ రాదని.. కేవలం జాగ్రత్తలు మాత్రమే నివారణ అంటూ నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన సెహరీ అనే సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా విషయమై కూడా వ్యాఖ్యలు చేశాడు. కరోనా వ్యాక్సిన్ వస్తుందని అంతా అంటున్నారు. కాని కరోనాకు వ్యాక్సిన్ రావడం లేదు.. వస్తుందో రాదో కూడా తెలియదు.

వ్యాక్సిన్ వస్తుందనే వార్తలు నిజం కాదు. అసలు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కరోనా అనేది మన జీవితాంతం ఉంటుంది. దాంతో మనం ఉన్నంత కాలం సహజీవనం సాగించాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కార్తీక మాసం అయినా కూడా తల స్నానాలు చేయవద్దు.

కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందని.. అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చేందుకు సిద్దంగా ఉందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ సమయంలో బాలకృష్ణ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వ్యాక్సిన్ వస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో బాలయ్య ఇంతటి వ్యాఖ్యలు చేశాడేంటి అంటూ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఊరికే అవగాహణ లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ఎప్పటికి ఉంటుందని మీరు అంటున్నారు. మరి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ లో ఎందుకు పాల్గొనడం లేదు అంటూ నెటిజన్స్ ఆయనపై మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. మోనార్క్ టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.