ఆచార్య మరో డేట్ వచ్చింది

0

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చిలో నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే మళ్లీ పునః ప్రారంభించేందుకు తేదీ ఫిక్స్ చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చిరంజీవి కూడా సెట్ లో జాయిన్ అవ్వబోతున్నాడు అనుకుంటున్న సమయంలో అందరికి జనరల్ గా కరోనా పరీక్షలు నిర్వహించగా చిరంజీవి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో చిరంజీవి వెంటనే ఐసోలేషన్ కు వెళ్లి పోవడం జరిగింది. మూడు రోజుల తర్వాత కరోనా టెస్టు రిపోస్ట్ తప్పు అని ఆ తర్వాత చేయించుకున్న మూడు రిపోర్ట్ ల్లో కూడా నెగటివ్ వచ్చిందని చిరంజీవి ప్రకటించడంతో మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ ఇప్పటికే ఆచార్య సెట్ లో జాయిన్ అయ్యాడు. ఏర్పాట్లలో మునిగి తేలారు. కొన్ని చిరంజీవి లేకుండా షాట్ లను చిత్రీకరించారు. అధికారికంగా ఈ సినిమా చిత్రీకరణలో చిరంజీవి ఈనెల 20వ తారీకు నుండి జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కరోనా నెగటివ్ అంటూ నిర్థరణ అవ్వడంతో ఈ కొత్త డేట్ ను ఫిక్స్ చేశారు. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి కూడా ఇకపై ఎలాంటి బ్రేక్ లేకుండా చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే సమ్మర్ లో సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ కీలకమైన గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది.