Templates by BIGtheme NET
Home >> Cinema News >> రెండు నెలలు ఆలస్యంగా ‘వకీల్ సాబ్’?

రెండు నెలలు ఆలస్యంగా ‘వకీల్ సాబ్’?


బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ముఖ్యంగా పవన్ అభిమానుల కోసం అన్నట్లుగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్లోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా షూటింగ్ కూడా పూర్తి అవ్వలేదు.

ఇటీవలే షూటింగ్ ప్రారంభం అవ్వడంతో సంక్రాంతికి ఖచ్చితంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటూ అంతా నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా సంక్రాంతికి విడుదల చేసే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే డిసెంబర్ నుండి థియేటర్లు పునః ప్రారంభం అవుతాయి అంటున్నారు. అది కూడా నమ్మకం లేదు. జనవరి నుండి ఒక వేళ థియేటర్లు నడిచినా కూడా జనాలు ఎంత వరకు వస్తారు అనేది తెలియదు.

సంక్రాంతి సీజన్ కోసం అంటూ చాలా సినిమాలు కాచుకు కూర్చున్నాయి. థియేటర్లు ఓ మోస్తరుగా నడిచినా కూడా సినిమాలు చాలా విడుదలకు ఉన్నాయి. కనుక మార్చిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మామూలుగా అయితే మార్చిలో పరీక్షల సీజన్ కనుక సినిమాలు విడుదల కావు. కాని ఈసారి విద్యా సంవత్సరం మొదలు కాలేదు. కొన్ని చోట్ల మొదలు అయినా కూడా మే జూన్ లో పరీక్షలు ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ సారి మార్చికి పరీక్షలు ఉండవు. కనుక మార్చిలో థియేటర్లు పూర్తి స్తాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అంతలో వ్యాక్సిన్ కూడా వస్తుంది కనుక విడుదల మంచిదనే అభిప్రాయంలో దిల్ రాజు ఉన్నాడట. వకీల్ సాబ్ విడుదల విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.