కొత్త కాపురానికి ఇల్లు రెడీ చేసుకుంటున్న చందమామ

0

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పైగా కొత్త కాపురం అంటే ఆషామాషీనా? బాగా బడ్జెట్ల పెట్టాలి. కొత్త జంటకు అన్నీ సౌకర్యంగా అమరాలి. సొంత ఇల్లు సొంత కార్ సొంతంగా ప్రతిదీ ఉంటేనే దర్జాగా కుదురుతుంది. ప్రస్తుతం చందమామ కాజల్ పరిస్థితేమిటి?

తాను ప్రేమించిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడేయబోతోంది. మరి సొంత ఇల్లు కొనేసారా ఈ జంట? అంటే… గౌతమ్ తమ కొత్త భవిష్యత్ ఇంటిని రెడీ చేసేస్తున్నాడట. ప్రస్తుతానికి వారి ఇల్లు అసంపూర్తిగా ఉన్నా.. భవిష్యత్ ఇంటికి సంబంధించిన ఒక స్నీక్ పీక్ ని అభిమానుల కోసం షేర్ చేశారు.

అత్యంత ప్రియమైన వ్యక్తి అయిన అందమైన నటి పట్ల మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అతను చాలా మంచివాడు అతను అడగడం లేదా సూచనలు కూడా ఒక పోస్ట్ రాశాడు. “ఎమైనా సలహాలు ప్లీజ్.. క్లాసిక్? ఆధునికమా? అధునాతనమా?“ అంటూ వ్యాఖ్యానించాడు.. అయితే ఇంటీరియర్ డిజైనింగ్ గురించి కాజల్ కు చాలా బాగా తెలుసు. అంతేకాదు.. గౌతమ్ కి తన సొంత ఇంటీరియర్స్ స్టోర్ ను కలిగి ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి ప్రతిదీ సతీమణి చూసుకుంటుందనడంలో సందేహమేం లేదు. ఇక్కడ నమ్రత మహేష్ లాంటి సెలబ్రిటీ సొంత ఇంటి నిర్మాణం సమయంలో అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అలానే ఉపాసన రామ్ చరణ్ సైతం సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రతిదీ తానే అయ్యి చూసుకున్నారు. ఇప్పుడు కాజల్ వంతు అన్నమాట!!