Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘ప్రిడేటర్ డ్రోన్’ లాడెన్ ను చంపింది ఇదే..! దీని గురించి పూరి ఏమంటున్నాడు..

‘ప్రిడేటర్ డ్రోన్’ లాడెన్ ను చంపింది ఇదే..! దీని గురించి పూరి ఏమంటున్నాడు..


దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో రకరకాల విషయాలను ఆడియన్స్తో పంచుకుంటున్న విషయం తెలిసిందే. పూరీ మ్యూజింగ్స్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ వీడియోను వ్యూస్ చూస్తే మనకు ఈ విషయం తెలుస్తుంది. అయితే తాజాగా పూరి ‘ప్రిడేటర్ డ్రోన్’ గురించి చెప్పాడు. ఈ వీడియోలో పూరి ఏమన్నాడంటే.. ` ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ డ్రోన్ ఇది. రైఫిల్స్ మిస్సైల్స్ను తన వెంట తీసుకెళ్తుంది. పది అడుగుల పొడవుంటుంది. రెక్కలు 55 అడుగుల పొడవుంటాయి. 25 వేల అడుగుల ఎత్తులో ఎగురగల సామర్థ్యం దీనికుంది. గాలిలో 20 నుంచి 30 గంటలు ఉండగలదు. అది ఒక డేగ. అది ఓ నగరం పైన ఉందంటే.. ఆ సిటీ మొత్తం సర్వైలెన్స్లో ఉన్నట్టే. ఎక్కడ కావాలనుకుంటే అక్కడకు జూమ్ చేసి సిటీలో ఉండే ప్రతి ఒక్కరినీ క్లోజ్ గా అబ్జర్వ్ చేయొచ్చు. వేల మంది టెర్రరిస్ట్ లు చని పోవడం లో ఈ డ్రోన్ దే కీలక పాత్ర. ఈ డ్రోన్ అంటే టెర్రరిస్ట్ల కు చాలా వణుకు.

ఓ రోజు పాకిస్థాన్ లోని అబోటాబాద్ లోని ఓ అనుమానాస్పద ఇల్లు ప్రిడేటర్ డ్రోన్ ద్వారా అమెరికా సీఐఏ కంటపడింది. ఆ ఇంటికి కరెంట్ సప్లై ఫోన్ కనెక్షన్ లేదు. ఆ ఇంటి గేటు ఎప్పుడూ తెరిచేవారు కాదు. రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంటి కాంపౌండ్ లో వాకింగ్ చేసేవాడు. ఆ వాకింగ్ చేస్తున్న వ్యక్తి నీడ ఆధారంగా అతడి హైట్ 6.3 అని తెలుసుకున్నారు. ఆ హైట్ ఆధారంగా ఆ నడిచే వ్యక్తి ఒసామా బిన్ అని తెలిసింది. ఈ డ్రోన్ సాయంతో ఆ ఇంటిని లేజర్ స్కాన్ చేశారు. అచ్చం అలాంటి ఇంటినే అమెరికాలో కట్టారు. అలాంటి ఇంట్లో ఓ టెర్రరిస్ట్ ఉంటే ఎలా ఎటాక్ చేయాలో సీల్ టీమ్ కు శిక్షణ ఇచ్చారు. ఆరు నెలల తర్వాత ఓ రాత్రి ఎటాక్ ప్లాన్ చేశారు. ఆ ఆపరేషన్ కు జోరానిమో అని పేరు పెట్టారు. ఒబామా టీమ్ అమెరికాలోని వైట్ హౌస్ లో కూర్చుని ఈ డ్రోన్ సీల్స్ బాడీ కెమెరాల ద్వారా అపరేషన్ ను మానిటర్ చేస్తూ లాడెన్ ను చంపేశార`ని పూరీ పేర్కొన్నారు.