టాలీవుడ్ గురించి కంగనా వ్యాఖ్యలు

0

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాద్ మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని తాము నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆయన వ్యాఖ్యలపై కంగనా స్పందించింది. ప్రజలు భారతదేశంలో అతి పెద్ద సినిమా పరిశ్రమ హిందీ సినిమా పరిశ్రమ అనుకుంటున్నారు. అది తప్పు అంటూ కంగనా పేర్కొంది. ఇండియాలో పలు భాషల సినిమా పరిశ్రమలో ఉన్నాయి. అందులో తెలుగు సినిమా పరిశ్రమ కూడా కీలకమైనది. తెలుగు సినిమా పరిశ్రమ తనను తాను దేశంలో అగ్రగణ్యమైన సినిమా పరిశ్రమగా నిలుపుకుంది. బహు భాష సినిమాలు చేయడంతో పాటు పాన్ ఇండియా సినిమాలు చేయడంలో తెలుగు సినిమా మేకర్స్ ముందు ఉంటారు. ఎన్నో హిందీ సినిమాలు కూడా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయని కంగనా పేర్కొంది.

ఇండియాలో అనేక భాషల సినిమా ఇండస్ట్రీలు కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి ఉండాలని కోరుకుంటున్నట్లుగా కంగనా ట్వీట్ చేసింది. హాలీవుడ్ తరహాలో ఒక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుందనే అభిప్రాయంను కంగనా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో సినిమా పరిశ్రమలో ఉన్న 8 టెర్రరిజంలు ఎత్తి చూపింది. ఆ ఎనిమిది సమస్యలు పూర్తిగా తొలగించినప్పుడు మాత్రమే మంచి సినిమాలు వస్తాయనే అభిప్రాయంను వ్యక్తం చేసింది.

1. నెపొటిజం టెర్రరిజం
2. డ్రగ్స్ మాఫియా టెర్రరిజం
3. లైంగిక వేదింపుల టెర్రరిజం
4. ప్రాంతీయత టెర్రరిజం
5. ఫారిన్ ఫిల్మ్ టెర్రరిజం
6. పైరసీ టెర్రరిజం
7. లేబర్ ను ఇబ్బంది పెట్టే టెర్రరిజం
8. ప్రతిభను దోచే టెర్రరిజం