ఈసారి నిరాశపర్చితే ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోరేమో!

0

ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సమయంలో ‘రాధేశ్యామ్’ సినిమాను మొదలు పెట్టాడు. సాహో విడుదలకు ముందే రాధేశ్యామ్ కొంత మేరకు షూటింగ్ పూర్తి అయ్యింది. దాంతో సాహో విడుదల అయిన కొన్ని నెలల్లోనే రాధేశ్యామ్ వస్తుందని ప్రేక్షకులు ఆశించారు. కాని ప్రభాస్ బాహుబలి మరియు సాహోల రేంజ్ లోనే ఈ సినిమా కూడా చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. సినిమా కు సంబంధించి అప్ డేట్ ఏమీ ఇవ్వక పోవడంతో సోషల్ మీడియాలో యూవీ క్రియేషన్స్ కు వ్యతిరేక ప్రచారం మొదలైన విషయం తెల్సిందే.

ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇక ప్రభాస్ బర్త్ డే వచ్చే నెల 23న జరుగబోతుంది. ఆ రోజున రచ్చ చేయాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో రాధేశ్యామ్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేసి రికార్డు సృష్టించాంటూ భావిస్తున్నారట. రాధేశ్యామ్ నుండి ప్రభాస్ బర్త్ డేకు టీజర్ ను విడుదల చేయాలని మొదట మేకర్స్ భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోషన్ పోస్టర్ వస్తుందేమో అంటున్నారు.

టీజర్ కాకుండా మోషన్ పోస్టర్ లేదా మరేదైనా పోస్టర్ విడుదల చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా అనేది అనుమానంగా ఉంది. టీజర్ కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న అభిమానులకు నిరుత్సాహం తప్పదేమో అంటున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు టీజర్ ను విడుదల చేయాలనుకుంటే అందుకు సంబంధించిన ఫుటేజ్ ఎక్కువగా లేదని ఇప్పటి వరకు తీసిన సీన్స్ లో టీజర్ షాట్స్ తక్కువగా ఉన్నాయనే ఉద్దేశ్యంతో మోషన్ పోస్టర్ మాత్రమే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.