Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాహుబలి రచయిత ‘సీత’ ఎవరో తేలిపోయింది

బాహుబలి రచయిత ‘సీత’ ఎవరో తేలిపోయింది


బాహుబలి తర్వాత వరుసగా తెలుగు.. హిందీ.. తమిళం సినిమాలకు కథలను అందిస్తూ ఇండియాస్ నెం.1 రచయితగా పేరు దక్కించుకున్న టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నుండి రాబోతున్న కొత్త సినిమా ‘సీత’. రామాయణంలో సీత పాత్రను ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాలుగా చూపించారు. కాని విజయేంద్ర ప్రసాద్ సీత పాత్రను కొత్త కోణంలో చూపించడం కోసం ఈ కథను రాశారు. సీత టైటిల్ ను ఇప్పటికే అధికారికంగా విడుదల చేసి సినిమాను ప్రకటించారు. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సీత సినిమా దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ భారీ ఛారిత్రాత్మక సినిమా లో సీత పాత్ర పోషించబోతున్నది ఎవరై ఉంటారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విజయేంద్ర ప్రసాద్ కథ అంటే బాలీవుడ్ లో పలువురు స్టార్స్ ఆసక్తిని కనబర్చుతున్నారు. సీత పాత్రను పోషించేందుకు గాను కరీనా కపూర్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే సెకండ్ బేబీకి జన్మనిచ్చిన కరీనా కపూర్ కొన్ని నెలల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. సీత పాత్రతో ఆమె తన రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ను అతి త్వరలోనే పట్టాలెక్కించే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా స్టార్ డం ను కలిగి ఉన్న కరీనా కపూర్ ఈ సినిమా లో నటించడం వల్ల సినిమా రేంజ్ మరింతగా పెరగడం ఖాయం. త్వరలోనే సీత సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.