Templates by BIGtheme NET
Home >> Cinema News >> సూపర్ స్టార్ వాట్సాప్ డీపీ వైరల్..!

సూపర్ స్టార్ వాట్సాప్ డీపీ వైరల్..!


నటశేఖర కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ హాలీవుడ్ కటౌట్ ని గుర్తు చేస్తుంటారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఆయన అభిమానులు మహేష్ కు సంబంధించిన ఏ చిన్న విషయం తెలిసినా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘కింగ్’ అక్కినేని నాగార్జున కారణంగా మహేష్ బాబు వాట్సాప్ డీపీగా ఏ ఫోటో పెట్టుకున్నాడనేది బయటకు వచ్చింది.

నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిన్న ట్విట్టర్ లో కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడు. అవి ట్రైలర్ ని మెచ్చుకుంటూ మహేష్ బాబు – చిరంజీవి వాట్సాప్ ద్వారా నాగ్ తో జరిపిన పర్సనల్ చాటింగ్ కు సంబంధించినవి. ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ చూసిన మహేష్ టెర్రిఫిక్ గా కూల్ గా ఉందని నాగార్జునకు మెసేజ్ చేసాడు. ఇందులో మహేష్ బాబు వాట్సాప్ డీపీ కనిపించింది. ఓ సింహం ఫోటోని మహేష్ డీపీగా పెట్టుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ కాస్త కూడా ఆలస్యం చేయకుండా అదే ఫోటోని డీపీలుగా పెట్టుకుంటూ ఖుషీ అవుతున్నారు. అంతేకాక మంచి మనసు చేసుకుని మహేష్ మొబైల్ నంబర్ కూడా ఇవ్వమని నాగార్జునను రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు.

ఇదిలావుండగా మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.