ప్రభాస్ మూవీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ సినిమాటోగ్రాఫర్..!?

0

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తను హీరోగా వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. సాహో సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ప్రభాస్ సినిమాల పై అంచనాలు ఓ రేంజిలో ఏర్పడ్డాయి. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమాలో నటించనున్నాడు ప్రభాస్. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్.. సూపర్ హీరోగా కనిపించనున్నాడట. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఆ సినిమా మొదలు కాకముందే తాజాగా మరో పాన్ ఇండియా మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రకటన ఇంటర్నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే దాదాపు ఈ సినిమా బడ్జెట్ 300 నుండి 500 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు.

పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రతీ నటుడికి ప్రత్యేకం అనే చెప్పాలి. బాహుబలి మొదటి అడుగు అయితే ఆదిపురుష్ దానికి మించి భారీతనంతో ఈ సినిమా ఉండబోతుందని.. ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని టాక్. అయితే మిగతా నటీనటుల వివరాలు తెలియదు కానీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ ఇతనే అంటూ ఓ ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఎవరో కాదు.. కార్తీక్ పళని. ఇప్పటివరకు ఎలాంటి పెద్ద సినిమా చేయలేదు. తెలుగులో నెక్స్ట్ నువ్వే బ్రాండ్ బాబు సినిమాలు చేసిన కార్తీక్.. ఇటీవలే కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్ సినిమాకు పనిచేసాడు. అయితే కొడైకెనాల్ అందాలను బాగా కాప్చర్ చేసాడని ప్రశంసలు దక్కాయి. ఇక పెంగ్విన్ సినిమా ఛాయాగ్రహణం గురించి విని ఆదిపురుష్ బాధ్యతలు కార్తీక్ పళనికి అప్పగించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం పై ఇంతవరకు చిత్రయూనిట్ స్పందించలేదు. చూడాలి మరి కార్తీక్ అదృష్టం ఎలా ఉందో..!