న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ‘Rx 100’ హీరో…!

0

యువ హీరో కార్తికేయ ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టాడు. ‘Rx 100’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘గుణ 369’ ‘హిప్పీ’ ’90 ML’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నెగెటివ్ రోల్ లో కనబడి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో రేపు (సెప్టెంబర్ 21) తన బర్త్ డే సందర్భంగా న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు కార్తికేయ గుమ్మకొండ.

కాగా కార్తికేయ కెరీర్ లో 7వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ కి కొత్త దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో 88 రామారెడ్డి ఈ మూవీని నిర్మించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కనున్న ఈ మూవీలో కార్తికేయ NIA ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. పలు తమిళ్ చిత్రాల్లో నటించిన యంగ్ బ్యూటీ తాన్య రవిచంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. సాయి కుమార్ – తనికెళ్ళ భరణి – సుధాకర్ కోమాకుల – పశుపతి కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్.ఆర్.విహారి సంగీతం అందిస్తుండగా పి.సి.మౌళి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.