ఆ ఇద్దరు నిర్మాతల గొడవల్లో ఇరుక్కున్న నటి?

0

నేను శైలజ- మహానటి సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడంతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. సావిత్రి బయోపిక్ వల్ల సౌత్ స్టార్ హీరోయిన్ గా విశిష్ఠ గౌరవం అందుకుంది. అయితే మహానటికి ముందే నేను శైలజ ఫేం అంటూ కీర్తి ని మీడియా హైలైట్ చేసింది. నిజానికి నేను శైలజ కీర్తి నటించిన డెబ్యూ సినిమా కాదు. అంతకుముందే `ఐనా ఇష్టం నువ్వు` అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో సీనియర్ నరేష్ కుమారుడు విజయ్ నవీన్ కృష్ణ హీరో. ట్రైలర్ కూడా రిలీజైన ఈ మూవీ రైట్స్ విషయంలో గొడవలతో రిలీజ్ వాయిదా పడింది.

ఇప్పటికే ఐదేళ్లయ్యింది ఈ మూవీ ల్యాబుకి అంకితమై. ఈ సినిమాని నిర్మించిన కళాదర్శకుడు చంటి అడ్డాల ప్రస్తుతం టైటిల్ మార్పుతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. రైట్స్ నావద్ద ఉన్నాయి అంటూ మరో నిర్మాత కం పంపిణీదారుడు నట్టి కుమార్ అడ్డు పడుతున్నారట. చంటి అడ్డాలతో నట్టి గొడవ ఏమిటి? అన్నదానిపై సరైన క్లారిటీ ఏదీ లేదు. కారణం ఏదైనా కీర్తి నటించిన డెబ్యూ సినిమా అలా అప్పట్లో ఆగిపోయింది. ఇప్పటికీ విడుదలకు నోచుకోవడం లేదు.

ఆసక్తికరంగా ఈ మూవీని సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఇంతకీ ఐనా ఇష్టం నువ్వు రిలీజ్ హక్కుల పంచాయితీ తేలేది ఎప్పటికి అన్నది చూడాలి. ఇదే తరహాలో పలువురు కథానాయికలు నటించిన డెబ్యూ సినిమాలు రిలీజ్ చూడక ల్యాబుల్లో ఉన్న సందర్భాలున్నాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాజ్యమేలే చాలామంది నటించిన సినిమాలు చాలా కాలం ల్యాబుల్లో మగ్గి తర్వాత రిలీజయ్యాయి.