మహేష్ మూవీలో ‘డర్టీ’ హీరోయిన్ నటించనుందా…?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో మిగతా లీడ్ యాక్టర్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మహేష్ కి జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతినాయకుడు పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటి కనిపించబోతుందని మరో న్యూస్ స్ప్రెడ్ అయింది.

కాగా ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ కు సిస్టర్ క్యారక్టర్ ఉండగా.. అందుకోసం ‘డర్టీ పిక్చర్’ హీరోయిన్ విద్యాబాలన్ ని సంప్రదిస్తున్నారట. కథలో కీలకమైన ఈ పాత్రలో ఆమె అయితేనే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీని కోసం మహేష్ అండ్ టీమ్ స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా వెళ్లనున్నారని సమాచారం. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ‘సర్కారు వారి పాట’కు థమన్ పాటలు అందిస్తుండగా మధి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.