సర్కారు వారి పాట : కీర్తి సురేష్ పై వచ్చినవన్నీ రూమర్లే !

0

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తాజాగా నటుస్తున్న మూవీ సర్కారు వారి పాట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు పరశురామ్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కారణంగా షూటింగ్ మొదలవలేదు. కొద్దిగా పరిస్థితులు మెరుగవగానే షూటింగ్ మొదలు పెట్టనున్నారు. షూటింగ్ కు కావాల్సిన సెట్లు ఇతర వ్యవహారాలపై పరశురాం బిజీగా ఉన్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు మొదటినుంచి ప్రచారంలో ఉంది. ఆమె కూడా పలుమార్లు ఈ విషయమై నిర్ధారించారు కూడా. అయితే ఈ మూవీ మేకర్స్ కీర్తి సురేష్ ను పక్కన పెట్టి మరో స్టార్ హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమాలో కీర్తి సురేష్ ఉందా లేదా అనే విషయమై పలు ప్రశ్నలు తలెత్తాయి.

అయితే దీనిపై పక్కా సమాచారం అందింది. మరో హీరోయిన్ ను తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి యూఎస్ లో కొంతమేర చిత్రీకరణ జరపాల్సి ఉంది. దీంతో కీర్తి సురేష్ యూఎస్ వర్క్ పర్మిట్ కోసం చిత్ర యూనిట్ వీసా కోసం కూడా అప్లై చేశారు. దీంతో కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. అలవైకుంఠపురముతో భారీ హిట్టు కొట్టిన తమన్ ఈ సినిమాకు సంగీతం అందించడంతో అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.సర్కారు వారి పాట ని మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యా నర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గీత గోవిందం వంటి భారీ హిట్ తర్వాత పరశురాం దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.