కేజీఎఫ్ 2 సెట్స్ నుంచి బెల్లంకొండ కోసం..!

0

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సందడి ఇటీవల ఏమంత కనిపించలేదు. తాజాగా ఆయన కూడా స్పీడ్ పెంచారు. లాక్ డౌన్ కారణంగా ఐదారు నెలలుగా షూటింగ్ లకు దూరమైన ఆయన మళ్లీ రీలోడ్ అయ్యారు. కన్నడలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ `కేజీఎఫ్ చాప్టర్ 2`లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అధీర సంజయ్ దత్ పాత్ర ఎంత కీలకమో ప్రకాష్ రాజ్ పాత్ర కూడా అంతే కీలకం అన్న చర్చా సాగుతోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.

అక్కడ ముగించేశాక ప్రకాష్ రాజ్ తాజాగా తెలుగు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం `అల్లుడు అదుర్స్` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో మొదలైంది. లాక్ డౌన్ కి ముందే దాదాపుగా చిత్రీకరణ మొత్తం పూర్తయినా సోనుసూద్.. ప్రకాష్ రాజ్ కు సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ బ్యాలెన్స్ డ్ గా వుండిపోయింది.

తాజాగా ఈ సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది. త్వరలో నభా నటేష్.. అను ఇమ్మాన్యుయేల్.. బెల్లంకొండ శ్రీనివాస్ ల కలయికలో పాటల చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇక ఇటీవలి కాలంలో నాగార్జున.. తర్వాత షూటింగుకి భయపడకుండా ఎటెండవుతున్న సీనియర్ స్టార్ ప్రకాష్ రాజ్ అన్న చర్చా సాగుతోంది.