అఖిల్ కోసం `బాహుబలి` VFX స్పెషలిస్ట్

0

సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం అఖిల్ చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. నాలుగు సినిమాల ప్రయాణంలో అతడికి సంతృప్తినిచ్చేంత పెద్ద విజయం దక్కకపోవడంతో అది నిరాశే అయ్యింది. అందుకే ఇప్పుడు రేసుగుర్రం డైరెక్టర్ సురేంద్ రెడ్డితో ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ కోసం అఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. బడ్జెట్ ఎంతైనా అఖిల్ కెరీర్ బెస్ట్ హిట్ కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున నిర్మించనుంది.

ఈ సినిమా కోసం ఎంచుకున్న కథాంశంలో ఎంటర్ టైన్ మెంట్ కి బిగ్ స్పాన్ ఉందిట. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ VFX కోసం కమల్ కన్నన్ ని బరిలో దించారట. అతడు గతంలో బాహుబలి 2.. లాంటి చిత్రాలకు పనిచేశాడు. అంత పాపులర్ టెక్నీషియన్ ఈ మూవీకి పని చేయడం అంటే ప్రాజెక్ట్ రేంజ్ ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు.

ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ ఇది. సురేందర్ రెడ్డి అఖిల్ కోసం చాలా పెద్ద బడ్జెట్ నే పెట్టిస్తున్నారని అర్థమవుతోంది. అయితే ఇటీవల మార్కెట్ పరంగా కొన్ని చిక్కు ముడులు ఎదురవుతున్నాయి. ఆ రేంజును మించకుండానే ప్లాన్ చేస్తున్నారా? లేక అసలు ప్లాన్ ఏమిటి? అన్నదానికి దర్శకుడు సూరినే స్పందించాల్సి ఉంటుంది.