కుర్ర హీరోయిన్లకు కోడలు విసిరిన సవాల్

0

గ్లామర్ ప్రపంచానికి ఏం కావాలి? అది అందిస్తేనే కథానాయికలకు మనుగడ. ఈ సూత్రాన్ని తూ.చ తప్పక అనుసరించేందుకే మన భామలు సిద్ధంగా ఉంటారు. రంగుల ప్రపంచంలో అవకాశాలు చేజారకుండా ఆకట్టుకోవాలంటే ఎన్నో సాహసాలు జాగ్రత్తలు అవసరం. కాస్త ఏజ్ బార్ అవుతుంటే మరింతగా అందంపైనా గ్లామర్ ఎలివేషన్ పైనా కేర్ తీసుకోవాలి. నిరంతరం ఏదో ఒక వేడెక్కించే టాపిక్ తో అభిమానులకు ఇండస్ట్రీ వర్గాలకు టచ్ లో ఉంటేనే ఆఫర్ వెంట పడుతుంది. ఇదిగో లేటెస్టుగా అక్కినేని కోడలు సమంత ఫోటోషూట్ ఆ సంగతినే చెబుతోంది.

వయసు పరంగా ఇప్పటికే సీనియర్ గానే చూస్తారు సామ్ ని. మ్యారేజ్ తరువాత కెరీర్ ఊగిసలాట స్టేజ్ కి చేరువైనా ఉన్నట్టుండి మెరుపులు మెరిపిస్తూ ఆకట్టుకోవడం సమంత అక్కినేనికే చెల్లింది. తాజా ఫోటోషూట్ల తో తాను ఎంత మాత్రం కుర్ర హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోలేదని ప్రూవ్ చేసుకోవడానికి తెగ ట్రై చేస్తోంది. ఇటీవల ఉపాసన కొణిదెలతో కలిసి ఫిటినెస్ కి సంబంధించిన వెబ్ సైట్ ని మొదలుపెట్టిన సమంత.. దాని ప్రచారం కోసం చేసిన ఫొటో షూట్ లో హాట్ అప్పియరెన్స్ తో షాకిచ్చింది.

స్కిన్ టైట్ డ్రెస్సులో సామ్ ఉన్నట్టుండి హీట్ పెంచేసింది. జిమ్ వేర్ లో సంథింగ్ హాట్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీటిచ్చింది. పెళ్లయ్యాక ఇలాంటి ఎక్స్ ప్లోజివ్ బట్టల్లో తళ్లుక్కుమనడం ఒక సెక్షన్ అభిమానులకు నచ్చడం లేదు. సాంప్రదాయ వాదులైన అభిమానులు దీనిని ఏమాత్రం హర్షించడం లేదు. దీంతో సమంత పై ఓ రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ కూడా పడుతున్నాయి. ఏదేమైనా కానీ తనలో స్పీడ్ ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తోందనేది వాస్తవం.