నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే రండీ కూర్చుని మాట్లాడుకుందాం

0

ఛలో.. గీత గోవిందం సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ సినిమాలతో సక్సెస్ దక్కించుకున్న రష్మికకు ఇంకా సినీ కెరీర్ చాలానే ఉంది. కాని ఆమె కెరీర్ ఆరంభం నుండి కూడా పెళ్లి వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఈమె స్టార్ డం దక్కించుకోక ముందే పెళ్లి నిశ్చితార్థం అయ్యింది. కాని ఏవో కారణాల వల్ల ఆ పెళ్లిని రష్మిక క్యాన్సిల్ చేసుకుని సినిమాలతో బిజీ అయ్యింది. ఈ సమయంలో కూడా రష్మిక పెళ్లి గురించి అభిమానులు సోషల్ మీడియాలో పదే పదే ప్రశ్నిస్తూ వస్తున్నారు.

ఇటీవల ఒకానొక సందర్బంగా మిమ్ములను పెళ్లి చేసుకోవాలనుకుంటు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటీ అంటూ ప్రశ్నించగా అందుకు రష్మిక మందన్న సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మొదట నావద్దకు వచ్చి కూర్చుని మాట్లాడాలి. కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్లాలి అనేది నేను చెప్తాను. ముందుగా నన్ను ఎలా కలవాలి అనే విషయాన్ని నా టీమ్ ను అడిగి తెలుసుకోండి. వాళ్లకు మెసేజ్ చేస్తే వారు రెస్పాండ్ అవుతారు అంటూ రష్మిక మందన్నా పేర్కొంది. వచ్చ మాట్లాడితే నచ్చితే పెళ్లికి సిద్దం అంటూ సింపుల్ గా చెప్పేసిన రష్మిక ప్రస్తుతానికి తాను ఎవరితో ప్రేమలో లేను అంటూ క్లారిటీ ఇచ్చింది.